News August 13, 2025

HYDలో పొంచి ఉన్న ముప్పు.. పిల్లలు జాగ్రత్త!

image

HYDలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. స్కూళ్లకు 2 రోజుల పాటు ఒంటిపూట, AUG 15న సెలవు పిల్లలకు కాస్త ఉపశమనమే. టైమ్ దొరికింది, హాఫ్ డే స్కూల్ సాకుతో ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లి వస్తామంటే పేరెంట్స్ జాగ్రత్త వహించండి. బయట వర్షాలు, వరద ముప్పు పొంచి ఉంది. గతంలో కళాసిగూడలో చిన్నారి మౌనిక నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ వానలో పిల్లలను షాపులకు సైతం పంపకండి. సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
SHARE IT

Similar News

News April 20, 2026

ఉ.9.30 నుంచే PGRS: నంద్యాల కలెక్టర్

image

వేసవి దృష్ట్యా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమయాన్ని మార్చినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ సమర్పించవచ్చని పేర్కొన్నారు.

News April 20, 2026

సంగారెడ్డి: నేటి నుంచి సంక్షేమ వారోత్సవాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, వంటగది పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులకు చిత్రలేఖనం, పెయింటింగ్, ఉపన్యాసం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు.

News April 20, 2026

అనంతపురం.. స్టేట్ టాపర్‌గా జాహ్నవి

image

అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్‌కు చెందిన శ్రీనివాసులు-రమాదేవి దంపతుల కుమార్తె జాహ్నవి CBSE టెన్త్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆలిండియా స్థాయిలో థర్డ్ ర్యాంకు కైవసం చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ స్కూల్‌లో చదివిన జాహ్నవికి 500కి 497 మార్కులు వచ్చాయి. స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన జాహ్నవిని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.