News August 13, 2025
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు: జగన్

AP: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉప ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. పోలీసులే ఏజెంట్ల ఫామ్‌లు చించేశారు. బూత్‌ల్లో వైసీపీ ఏజెంట్లను లేకుండా చేశారు. ఇంత అన్యాయమైన ఎన్నికలు నేనెప్పుడూ చూడలేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News August 15, 2025
కుక్కలకు మెరుగైన జీవితం ఇవ్వండి: కపిల్ దేవ్

వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలన్న SC తీర్పుపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ‘కుక్కల గురించి చాలా వార్తలు వింటున్నాం. అవి చాలా అద్భుతమైన జీవులు. వాటికి అధికారులు మెరుగైన జీవితాన్ని అందించాలి. ఊరికే అలా వాటిని ఎక్కడో పడేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. వీధికుక్కలపై జరుగుతున్న చర్చలు, వివాదాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
News August 15, 2025
వియత్నాం స్టీల్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీ

వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని స్టీల్ షిప్మెంట్స్‌పై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల భారత ఉక్కు రంగానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే విషయంపై ఏడాది పాటు దర్యాప్తు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అలోయ్/నాన్-అలోయ్ స్టీల్‌తో చేసిన ఉత్పత్తులపై ఈ సుంకం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తరహా టారిఫ్స్ విధించకపోతే దేశీయ ఉక్కు రంగానికి ప్రమాదమని పేర్కొంది.
News August 15, 2025
టీమిండియా రైజింగ్ స్టార్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇండియన్ క్రికెట్‌లో రైజింగ్ స్టార్ ఎవరో చెప్పారు. ‘నేను శుభ్‌మన్ గిల్‌ని టీమిండియా రైజింగ్ స్టార్‌గా భావిస్తున్నాను. కేవలం 25 ఏళ్లలోనే అతను ఎంతో గుర్తింపు సాధించారు. ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఇంగ్లండ్‌లో అతను ఎలాంటి సిరీస్‌ని ఎదుర్కొన్నారో అంతా చూశాం. అతను చాలా కామ్ అండ్ కంపోజ్డ్. సుదీర్ఘ ఇన్నింగ్సులు ఆడగల సత్తా అతనికి ఉంది’ అని పేర్కొన్నారు.