News August 13, 2025
1946-1962 వరకు బాపట్ల MLAగా మంతెన

మంతెన వెంకటరాజు(1904-1968) ఉమ్మడి గుంటూరు జిల్లా మంతెనవారిపాలెంలో జన్మించారు. 17ఏళ్ల వయస్సులోనే చదువును వదిలి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. పలు సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని జైలుకు వెళ్లారు. 1938లో రాజకీయ పాఠశాలను స్థాపించారు. సంఘ సంస్కరణలోనూ చురుగ్గా పాలుపంచుకున్నారు. 1934లో హరిజనులను దేవాలయాల్లోకి ప్రవేశింపజేశారు. వితంతు, కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. 1946-1962 వరకు బాపట్ల MLAగా చేశారు.
Similar News
News April 18, 2026
కర్నూలు: తెల్లవారుజామునే ప్రమాదాలు.. 15 మంది మృత్యువాత!

NH-167పై వరుస ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. గతేడాది నవంబర్ 29న ఎమ్మిగనూరు(M) కొటేకల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు, రెండ్రోజుల క్రితం మంత్రాలయం(M) చిలకలడోణ వద్ద 9 మంది మృతిచెందారు. 5 నెలల్లోనే 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలన్నీ తెల్లవారుజామునే జరిగాయి. నిద్రమత్తులో వాహనాలు నడపడం, అధిక వేగం, అలసట, విశ్రాంతి లేకపోవడం ఈ దారుణాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. హైవేపై భద్రత కట్టుదిట్టం చేయాలి.
News April 18, 2026
వరంగల్: NMC చేసిన మార్పుల వల్లే పరీక్ష వాయిదా!

MBBS పరీక్షల సిలబస్‌లో NMC నియమ నిబంధనల ప్రకారం (పాత నిబంధనలు) పేపర్-Iలోని జనరల్ సర్జరీ కింద చేర్చిన కొన్ని అధ్యాయాలు ఇప్పుడు కొత్త నిబంధనల్లో జనరల్ సర్జరీ పేపర్-IIలో చేర్చడం వల్లే ఈ నెల 15న జరిగిన <<19670707>>MBBS జనరల్ సర్జరీ పేపర్-1 (రెగ్యులర్) పరీక్ష రద్దు చేసి<<>>, ఈ నెల 27కు వాయిదా వేసినట్లు KNRUHS ప్రకటించింది. విద్యార్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
News April 18, 2026
వరల్డ్ హెరిటేజ్ డే: చారిత్రక వైభవం @ కౌలాస్ కోట

జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోట అపురూప శిల్పకళకు, చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. ఈ రాతి కోటలో అష్టభుజ ఎల్లమ్మ ఆలయం, వేంకటేశ్వరస్వామి గుడి, మసీదు, రాణిమహల్, ఫిరంగిలు ప్రధాన ఆకర్షణలు. బీదర్‌కు వెళ్లే సొరంగ మార్గం పర్యాటకులను అబ్బురపరుస్తోంది. మన పూర్వీకులు అందించిన ఈ అద్భుత కట్టడాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
#ఇవాళ వరల్డ్ హెరిటేజ్ డే


