News August 13, 2025

అల్లూరి జిల్లాలో పడిపోయిన ఆగాకరకాయ ధర

image

అల్లూరి జిల్లాలో ఆగాకరకాయ ధర రోజురోజుకీ పడిపోతోంది. వారం క్రితం 10కిలోలు రూ.1000కాగా బుధవారం రూ.600కి పడిపోయిందని రైతులు తెలిపారు. కొయ్యూరు, చింతపల్లి, రాజవొమ్మంగి, వై.రామవరం, అడ్డతీగల మండలాల్లో ఈ పంట ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలు కురవడంతో డిమాండ్ తగ్గిందని రైతులు అంటున్నారు. నర్సీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ పంటను కొనుగోలు చేస్తున్నారు

Similar News

News April 16, 2026

ప్రాజెక్టుల సాధన కోసం పోరాటం: ఎస్వీ మోహన్ రెడ్డి

image

కర్నూలు: రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్, గుండ్రేవుల సాగునీటి ప్రాజెక్టుల సాధన వరకు పోరాటం ఆపబోమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు సమాలోచన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గళం వినిపించారు.

News April 16, 2026

తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చుస్తావా?.. హరీశ్‌రావు ఫైర్

image

పార్లమెంట్‌లో TG ఏర్పాటుపై BJP MP తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?, దశాబ్దాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమైన అలాంటి మహోద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వీ క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.

News April 16, 2026

భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

image

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.