News August 13, 2025
విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డి

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో కోర్టు విచారణ ప్రారంభించింది. కాగా గత నెల 20 నుంచి మిథున్ రాజమండ్రి జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News August 15, 2025
కృష్ణా, గోదావరి నదుల్లో వాటా సాధిస్తాం: రేవంత్

TG: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర వాటాను సాధించి తీరుతామని CM రేవంత్ పునరుద్ఘాటించారు. ‘ఒత్తిడికి లొంగేది లేదు. మన ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. కానీ గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కూలి గోదావరిలో కలిసింది. సెంటిమెంట్ల పేరిట చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలి’ అని వ్యాఖ్యానించారు.
News August 15, 2025
క్షమాపణలు చెప్పిన మృణాల్ ఠాకూర్

సారీ చెబుతూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. గతంలో ఆమె బిపాషా బసుపై చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వీడియో ఇటీవల వైరల్ అయింది. వాటిపై <<17400036>>బిపాషా<<>> కూడా స్పందించారు. దీంతో ఆమె పేరు చెప్పకుండా మృణాల్ క్షమాపణలు కోరారు. ‘19 ఏళ్ల వయసులో నేను ఎన్నో సిల్లీ విషయాలు మాట్లాడాను. అవి ఇతరులను బాధపెట్టాయని అర్థమైంది. ఎవరినీ బాడీషేమింగ్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ తప్పు జరిగింది’ అని రాసుకొచ్చారు.
News August 15, 2025
మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ: చంద్రబాబు

AP: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని CM చంద్రబాబు తెలిపారు. మనది డెడ్ ఎకానమీ కాదని, గుడ్ ఎకానమీ అని ట్రంప్ వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్ ఇచ్చారు. ఇది ప్రపంచం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. అటు స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో AP ముందుకు వెళ్తోందని తెలిపారు. అప్పటివరకు మన తెలుగు జాతిని నంబర్ వన్‌గా చేయడమే తన ఆశయమని పంద్రాగస్టు వేడుకల్లో స్పష్టం చేశారు.