News August 13, 2025
మాదక ద్రవ్యాల రహితంగా జిల్లాను చేయాలి: కలెక్టర్

ఏలూరు సి.ఆర్ రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో బుధవారం నషా ముక్తి భారత్ అభియాన్ పురస్కరించుకొని డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని చేపట్టారు. మాదక ద్రవ్యాలను సేవించడం వలన సమాజానికి చేటు కలిగేలగా యువత వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ ప్రతాప్ కిషోర్ అన్నారు. మాదక ద్రవ్యాల రహిత ఏలూరు జిల్లాను ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు.
Similar News
News April 17, 2026
ఏయూ శతాబ్ది ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. శుక్రవారం ఏయూ సమీక్షలో మాట్లాడరు. ఏప్రిల్ 27న ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే కార్యక్రమానికి సుమారు 25 వేల మంది హాజరుకానున్నారు. వీవీఐపీలు రానున్న నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ఎల్ఈడీ స్క్రీన్లు పటిష్ఠంగా ఉండాలన్నారు.
News April 17, 2026
TU: పాలకమండలి సభ్యులను అభినందించిన ఉపకులపతి

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలికి నూతనంగా ప్రభుత్వం తరఫున నామినేట్ అయిన సభ్యులు ఆచార్య ఆంజనేయులు, డా.సుధాకర్‌లను వీసీ సమక్షంలో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ (అటుట్) ఆధ్వర్యంలో అభినందించారు. వీసీ ఆచార్య యాదగిరి రావు మాట్లాడుతూ.. పాలకమండలి సభ్యులు వర్సిటీ ప్రతిష్టను ఇనుమడింప చేసేలా, అభివృద్ధిలో భాగమై పనిచేయాలన్నారు. రిజిస్ట్రార్ యాదగిరి, అటుట్ సభ్యులు పాల్గొన్నారు.
News April 17, 2026
ADB: కేసీఆర్ ‘జైత్రయాత్ర’.. మారనున్న సమీకరణాలు..?

ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న ‘జైత్రయాత్ర’ బహిరంగ సభతో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కేసీఆర్ సమక్షంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన సాకుతో కాంగ్రెస్, బీజేపీ అసంతృప్త నేతలను ఆకర్షించడంపై గులాబీ దళం దృష్టి పెట్టింది. జీవన్ రెడ్డి చేరికతో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తోంది.


