News August 13, 2025

కమనీయం.. రాములోరి నిత్య కళ్యాణం

image

భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా జరిపారు.

Similar News

News August 13, 2025

అత్యవసర సమయంలో డయల్-100 కు కాల్ చేయండి: సీపీ

image

ఖమ్మం జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టాలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, స్థానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 సమాచారం ఆందిచాలని పేర్కొన్నారు.

News August 13, 2025

KMM: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి నిరాకరణ.. సూసైడ్

image

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెనుబల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గంగదేవిపాడుకి చెందిన దంతనపల్లి నాగరాజు(24) ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు తన తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 13, 2025

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

image

భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి అందుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ను ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించారు.