News August 13, 2025
NLG: 12 గంటల్లోనే పట్టుకున్నారు..!

కోర్టు నుంచి తప్పించుకున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మైనర్ బాలికపై లైంగికదాడి ఘటనలో నిన్న తుది తీర్పు వెలువడిన క్రమంలో భయభ్రాంతులకు గురై నిందితుడు పారిపోయిన విషయం తెలిసిందే. నిందితుడు గ్యారాల శివకుమార్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి 12 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News August 15, 2025
NLG: జిల్లాలో 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా గురువారం 40.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పత్తి, పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. అత్యధికంగా చందంపేటలో 82.9, MLGలో 75.9, పీఏ పల్లిలో 74.9, DVKలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా చిట్యాలలో 11.4 మీమీ వర్షం కురిసింది.
News August 14, 2025
30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్‌లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
News August 14, 2025
సీఎంకు రేవంత్‌కు గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ

‘మన ఊరు-మన బడి’ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ.361.350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు.