News August 13, 2025
అల్లూరి జిల్లా నుంచి 8 మంది టీచర్ల ఎంపిక: DEO

బెస్ట్ టీచర్ అవార్డులకు అల్లూరి జిల్లా నుంచి 8మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని DEO బ్రాహ్మజిరావు బుధవారం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్ నలుగురు, SGTలు ఇద్దరు, HMలు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి రాష్ట్ర విద్యాశాఖకు త్వరలో పంపుతామని తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వరకు అమరావతిలో వీరికి ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని, తుది జాబితా 25న ప్రకటిస్తారన్నారు. గురుపూజోత్సవంలో అవార్డు అందజేస్తారని చెప్పారు.
Similar News
News April 19, 2026
కాకినాడ: యానిమేటర్లకు అందని సెల్ ఫోన్లు

జిల్లాలోని డ్వాక్రా యానిమేటర్లకు పంపిణీ చేయాల్సిన సెల్‌ఫోన్లు ఇంకా వారి చేతికి అందలేదు. నాలుగు రోజుల క్రితమే కలెక్టరేట్‌లో పంపిణీ ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించినప్పటికీ, వెంటనే డి.ఆర్.డి.ఏ అధికారులు వాటిని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు ఎం.ఎస్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,500 మందికి పైగా యానిమేటర్లు తమకు ఫోన్లు ఎప్పుడు అందజేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
News April 19, 2026
అనకాపల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

దేవరాపల్లి మండలంలోని కొత్తూరు ముత్యాలంపాలెం గ్రామానికి చెందిన తమరాన అప్పారావు(58) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు గమనించి కె. కోటపాడు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని దేవరాపల్లి ఎస్ఐ సత్యన్నారాయణ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2026
గుంటూరు: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ ఫలితాల్లో గుంటూరు (D) రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 30,551 మందికి 26,856 మంది పాసయ్యారు. మొత్తం 7,808 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంప్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 27 లోపు ఫీజు చెల్లించాలి.


