News August 13, 2025
సిద్దిపేట: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: CP

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అనురాధ బుధవారం పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు, పరికరాలను ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి సమన్వయంతో విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100, 87126 67100కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.
Similar News
News April 18, 2026
IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.
News April 18, 2026
భద్రాచలం: శిశువు మృతి కేసులో సూపరింటెండెంట్‌కు నోటీసులా?

భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో శిశువు మృతి ఘటన అనంతరం పరిపాలనా చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ఘటనపై బాధ్యతల స్పష్టత కోసం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే రోజున విధుల్లో ఉన్న సిబ్బంది వ్యవహారంపై ఇప్పటికే వివరణలు కోరినట్టు తెలిసింది. ఘటనకు గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం.
News April 18, 2026
SRHలోకి సౌతాఫ్రికా పేసర్

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.


