News August 13, 2025
HYDకు జల ప్రళయం తప్పదా?

చినుకు పడితే వణికే HYD ఈ 3 రోజులు జల ప్రళయం ఎదుర్కోక తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల 7 సెం.మీ నుంచి 10 సెం.మీ వాన కురిస్తే ముంపు ఏరియాలతో పాటు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇక నార్త్ HYDలో 20సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మొన్న నమోదైన 15.15 సెం.మీ వర్షపాతంతో కుత్బుల్లాపూర్ అతలాకుతలమైంది. ఇప్పుడేమో <<17390735>>20 సెం.మీ<<>> అంటుంటే నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News August 16, 2025
HYD: మత్తు అనేక సమస్యలకు దారితీస్తుంది: ED

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్ పాల్గొని ఉద్యోగులతో మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. మత్తుపదార్థాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవడానికి ప్రతిఒక్కరూ చైతన్యంతో ముందుకురావాలని, మత్తుపదార్థాల నుంచి దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
News August 16, 2025
HYD: కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు కధీరవన్ పళని, జి.ముకుంద రెడ్డి, డీఆర్ఓ ఈ.వెంకటాచారితో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
News August 16, 2025
HYD: కోకాపేట్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

HYD కోకాపేట్ పరిధిలోని పోలువామి 90 విలాస్ ముందు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రోడ్డు దాటుతున్న సమయంలో టాండాల మంజుల(44) అనే మహిళను దత్తుచంద్ర అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. మంజుల గాంట్లకుంట పరిధి కన్వాయిగూడెం తండాకు చెందిన మహిళ అనే నార్సింగి పోలీసులు తెలిపారు.