News August 13, 2025
ఇండియన్ సిటిజన్ కాకముందే సోనియాకు ఓటు హక్కు: BJP

ఎలక్షన్ కమిషన్, కేంద్రం కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు BJP కౌంటర్ ఇచ్చింది. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే అక్రమంగా ఓటు హక్కు పొందారని ఆరోపించింది. ‘ఇందిరా PMగా ఉన్న సమయంలో 1980-82 మధ్య సోనియా ఓటు హక్కు పొందారు. అప్పటికి ఆమె భారత సిటిజన్ కూడా కాదు. ఇది అధికార దుర్వినియోగం కాక ఇంకేంటి?’ అని BJP నేత అమిత్ మాలవీయా ట్వీట్ చేశారు.
Similar News
News August 14, 2025
రాష్ట్రంలో కొత్తగా టూరిస్ట్ పోలీసులు

TG: పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు DGP జితేందర్ తెలిపారు. తొలి దశలో 80 మంది పోలీసులు పనిచేయనున్నారని చెప్పారు. అనంతగిరి, రామప్ప, సోమశిల, నాగార్జునసాగర్, బుద్ధవనం తదితర పర్యాటక ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ టూరిస్టులకు వీరు రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు. వచ్చే నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
News August 14, 2025
పాక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి!

పాక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీ సిటీలో పలుచోట్ల వేడుకల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గన్స్ ఫైర్ చేయడంతో ముగ్గురు మరణించారని, 60 మందికి పైగా గాయాలపాలైనట్లు Geo News వెల్లడించింది. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉందని పేర్కొంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపింది. కాగా గత JANలోనూ ఈ తరహా కాల్పుల్లో 42 మంది చనిపోయినట్లు సమాచారం.
News August 14, 2025
2028 నాటికి క్యాన్సర్ ఆస్పత్రి సిద్ధం: బాలకృష్ణ

AP: అమరావతి తుళ్లూరులో 21 ఎకరాల్లో ₹750 కోట్లతో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆస్పత్రిని 2028 నాటికి పూర్తి చేస్తామని MLA బాలకృష్ణ తెలిపారు. వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం 2 దశల్లో పూర్తిచేస్తామని, 2028లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు. తాము ఆస్పత్రిని లాభాపేక్ష కోసం నడపడంలేదని, తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్న తన తల్లి బసవతారకం కోరిక మేరకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు.