News August 13, 2025
మెదక్: నషా ముక్త భారత్ అభియాన్

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. అదనపు ఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు, DPO సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News August 14, 2025
మెదక్: ‘ప్రామాణికంగా భద్రతా చర్యలు చేపట్టాలి’

భద్రతా చర్యలను ప్రామాణికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి నెహ్రూ తెలిపారు. బుధవారం చేగుంట మండలం శ్రీ వెంకటేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, చిన్న శివనూర్, డెల్ ఎక్స్ ఎల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కూచారం, శివంపేట మండలం లూయిస్ ఫార్మా సీయుటుకల్స్, ప్రైవేట్ లిమిటెడ్ నవాబ్ పేట సంబంధిత పరిశ్రమలను పరిశీలించారు.
News August 14, 2025
మెదక్: ‘టీచర్ల నిబద్ధతతో పాఠశాలల్లో నూతన ఉత్సాహం’

FRS విధానం అమలుతో సమయపాలనలో క్రమశిక్షణ మరింత బలపడిందని డీఈవో రాధాకిషన్ తెలిపారు. టీచర్లు సమయానికి హాజరై, పాఠశాల సమయం ముగిసే వరకు నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. FRS యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను 3, 4 రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్టు DEO వెల్లడించారు. ఈ విధానం ద్వారా పాఠశాలల్లో పనితీరు, విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.
News August 14, 2025
సిద్దిపేట: రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి విద్యుత్ పునరుద్ధరణ

సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్‌ను పునరుద్ధరించేందుకు లైన్మెన్ హైముద్దీన్ సాహసం చేశాడు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చి విద్యుత్‌ని పునరుద్ధరించారు. హైముద్దీన్ ధైర్య సాహసాన్ని మెచ్చి స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.