News August 13, 2025

AP RAIN UPDATES

image

* విజయవాడలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి. మ్యాన్‌హోల్‌లో పడి ఒకరు, డ్రైనేజీలో పడి మరొకరు, చెట్టుకూలి మరో వ్యక్తి మరణించారు.
* మంగళగిరిలో అత్యధికంగా 20cm వర్షం. తెనాలిలో 18, బాపట్లలో 15, అమరావతిలో 14cm వాన పడింది.
* నాగార్జున వర్సిటీ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న విద్యార్థులు
* వర్షాలపై హోంమంత్రి అనిత కాసేపట్లో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.

Similar News

News August 14, 2025

రాష్ట్రంలో కొత్తగా టూరిస్ట్ పోలీసులు

image

TG: పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు DGP జితేందర్ తెలిపారు. తొలి దశలో 80 మంది పోలీసులు పనిచేయనున్నారని చెప్పారు. అనంతగిరి, రామప్ప, సోమశిల, నాగార్జునసాగర్, బుద్ధవనం తదితర పర్యాటక ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ టూరిస్టులకు వీరు రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు. వచ్చే నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

News August 14, 2025

పాక్‌ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి!

image

పాక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీ సిటీలో పలుచోట్ల వేడుకల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గన్స్ ఫైర్ చేయడంతో ముగ్గురు మరణించారని, 60 మందికి పైగా గాయాలపాలైనట్లు Geo News వెల్లడించింది. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉందని పేర్కొంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపింది. కాగా గత JANలోనూ ఈ తరహా కాల్పుల్లో 42 మంది చనిపోయినట్లు సమాచారం.

News August 14, 2025

2028 నాటికి క్యాన్సర్ ఆస్పత్రి సిద్ధం: బాలకృష్ణ

image

AP: అమరావతి తుళ్లూరులో 21 ఎకరాల్లో ₹750 కోట్లతో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆస్పత్రిని 2028 నాటికి పూర్తి చేస్తామని MLA బాలకృష్ణ తెలిపారు. వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం 2 దశల్లో పూర్తిచేస్తామని, 2028లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు. తాము ఆస్పత్రిని లాభాపేక్ష కోసం నడపడంలేదని, తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్న తన తల్లి బసవతారకం కోరిక మేరకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు.