News August 13, 2025

ప్రకాశం: భారీ వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

image

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తహశీల్దార్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు.

Similar News

News April 15, 2026

ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థి జిల్లా ఫస్ట్

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.

News April 15, 2026

ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి జిల్లా ఫస్ట్

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.

News April 15, 2026

ఇంటర్ ఫలితాలు.. 19వ స్థానంలో ప్రకాశం

image

ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా వి<<19653702>>ద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 19254 మందికి 13520 మంది పాసయ్యారు. 70 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16842 మంది పరీక్షలు రాయగా 12787 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో 17వ స్థానంలో చిలిచింది. ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ఇంటర్-1 ఇయర్‌లో 19వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 17వ స్థానంలో నిలిచింది.