News August 13, 2025
రేపు స్కూళ్లకు సెలవు

TG: భారీ వర్షాల నేపథ్యంలో రేపు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు పూర్తిగా సెలవు ఇస్తున్నట్లు DEO ప్రకటించారు. ప్రభుత్వ, ZP, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా తొలుత హాఫ్‌డే సెలవు ఇవ్వగా, తాజాగా పూర్తిగా సెలవు ఇచ్చారు. అటు జగిత్యాల, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు కూడా రేపు సెలవు ఉండనుంది.
Similar News
News August 30, 2025
‘పిచ్చి కుక్కలు’ అంటూ షమీ మాజీ భార్య పోస్ట్

తనను భయపెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరిగినా, ఎవరి బెదిరింపులకు భయపడలేదని క్రికెటర్ షమీ <<16902649>>మాజీ భార్య<<>> హసీన్ జహాన్ పోస్ట్ చేశారు. ‘పిచ్చి కుక్కలకు భయపడి ఉంటే 2018లోనే భయపడేదానిని. నన్ను నాశనం చేయాలని చూస్తే తట్టుకొని బలంగా మారుతా’ అని SMలో రాసుకొచ్చారు. ఇటీవల షమీ ఓ ఇంటర్వ్యూలో గతం గురించి వదిలేయాలని, వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జహాన్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
News August 30, 2025
నేడు విశాఖలో జనసేన బహిరంగ సభ

AP: విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇవాళ జనసేన బహిరంగ సభ(సేనతో సేనాని) నిర్వహించనుంది. రెండు రోజులుగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన పార్టీ చీఫ్ పవన్ భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీకి జన సైనికులు, వీర మహిళలే బలమని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సభలో పవన్ ఏం మాట్లాడుతారోననే ఆసక్తి నెలకొంది.
News August 30, 2025
రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల స్థానమిదే..

దేశంలో 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.72 లక్షల మంది మరణించగా, 4.62 లక్షల మంది గాయపడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ప్రమాదాలు 4.1%, మరణాలు 2.61% పెరిగాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల్లో ఏపీ(8,276), TG(8,103) ఏడు, ఎనిమిది స్థానాల్లో, మరణాల్లో AP(3,806), తెలంగాణ(3,508) 8, 9 స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అత్యధికం 35-45 ఏళ్ల వారే ఉన్నారని తెలిపింది.