News August 13, 2025

పెద్దపల్లి: సబ్సిడీ వ్యవసాయ పనిముట్లపై క్లారిటీ..!

image

వ్యవసాయ భూమి కలిగిన రైతులకు సబ్సిడీపై పనిముట్లు అనే దానిపై పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం సబ్సిడీపై పనిముట్లు అందజేయాలనే ఆలోచనలో ఉందన్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదని ఆయన తెలిపారు. జిల్లాలోని రైతులు అయోమయానికి గురికావద్దని సూచించారు. అసత్యపు ప్రచారాలు నమ్మవద్దన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాగానే వెల్లడిస్తామని ఆయన “Way2News”తో ఈ మేరకు తెలిపారు.

Similar News

News April 19, 2026

జగిత్యాల వేదికగా కేసీఆర్ వ్యూహాత్మక గర్జన

image

జగిత్యాలలో రేపు జరిగే KCR సభ రాజకీయంగా కీలక మలుపులు మలుచుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండబోతున్నట్లు ఈ సభ ద్వారా స్పష్టం చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టడానికి వ్యూహాత్మక అంశాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం విషయంలో CM రేవంతే లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేసి, రాష్ట్ర రాజకీయలను ప్రభావితం చేయాలని KCR ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

News April 19, 2026

చమత్కార కవిత్వ రచనలో దిట్ట ‘గాడేపల్లి’: భూతపురి

image

అవధానాల్లో, ఆశుకవితా ప్రదర్శనల్లో చమత్కార భరితంగా కవిత్వ రచన చేయడంలో దిట్ట గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ‘నెలనెలా సీమ సాహిత్యం’ సదస్సులో ‘గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి జీవితం – సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. ఆధునిక కాలంలో అవధానాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు.

News April 19, 2026

VKB: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తప్పిన ప్రమాదం

image

కుల్కచర్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ పిచికారీ ప్రదర్శనలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన.. డ్రోన్ పంపిణీని ప్రారంభిస్తుండగా అది అదుపుతప్పి ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.