News August 13, 2025

భారీ వర్షాలు.. విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అంబేడ్క‌ర్ పలు ఆదేశాలు జారీ చేశారు.
➤ గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలి
➤ ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వబడవు
➤ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మత్స్యకారుల వేట నిషేధం
➤ నీరు కాలుష్యం కాకుండా పైప్ లైన్స్ తనిఖీ చేయాలి
➤ వైద్య, వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు కూడా సిద్ధంగా ఉండాలి
➤ కలెక్టరేట్లో 08922 236947 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Similar News

News August 14, 2025

రూ.26 కోట్ల అంచనాతో 44 జలవనరుల పనులు: కలెక్టర్

image

జలవనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టోరేషన్ RRR క్రింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులకు కలెక్టర్ అంబేడ్క‌ర్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు.

News August 14, 2025

VZM: మరో వారం రోజులే గడువు.. త్వరపడండి..!

image

జిల్లాలో ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలను చదివించేందుకు మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ మాణిక్యంనాయుడు బుధవారం సూచించారు. 25 శాతం సీట్ల కేటాయింపులో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, 5 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలకు https://CSE.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 25న లాటరీ ద్వారా ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

News August 14, 2025

విజయనగరం జిల్లాలో నేడు హోం మినిస్టర్ పర్యటన

image

విజయనగరం జిల్లాకు హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం రానున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు.