News August 13, 2025

ఒంగోలులో జిల్లా స్థాయి పొగాకు కమిటీ సమావేశం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన జిల్లాస్థాయి పొగాకు కొనుగోలు కమిటీ సమావేశం జరిగింది. పొగాకు మిగిలిపోయిన రైతులకు కొనుగోలు షెడ్యూలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిటీ నిర్ణయించింది. అదనపు కేటాయింపుల కోసం పై అధికారులకు నివేదిక పంపినట్లు కమిటీ పేర్కొంది.

Similar News

News August 16, 2025

ఒంగోలులో సందడిగా ఎట్ హోమ్ కార్యక్రమం

image

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు.

News August 15, 2025

కష్టమైనా.. స్వాతంత్ర్య వేడుకలకు ప్రకాశం కలెక్టర్.!

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెకు పోలీసులు గౌరవ వందనం చేశారు. కలెక్టర్ కాలి పట్టీతో వేడుకలకు హాజరయ్యారు. కాలికి ప్రాక్చరై నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కలెక్టర్ వేడుకలకు వచ్చారంటూ అక్కడి అధికారులు చర్చించుకోవడం కనిపించింది. వేడుకలు ముగిసేవరకు కలెక్టర్ అక్కడే ఉన్నారు.

News August 15, 2025

ప్రకాశం జిల్లాలో బాలిక కిడ్నాప్

image

చీమకుర్తిలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి బాలికను శుక్రవారం కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. బాలిక తండ్రి తన నుంచి రూ.5 లక్షల అప్పు తీసుకుని ఇవ్వలేదని ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత కుమార్తెతో తండ్రికి ఫోన్ చేయించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈశ్వర్ రెడ్డి బాలికను తిరుపతి వైపు తీసుకెళ్తుండటంతో పోలీసులు అతడిని వెంబడిస్తున్నారు.