News August 13, 2025

విశాఖ‌ను మాద‌క ద్ర‌వ్య ర‌హిత జిల్లాగా తీర్చుదిద్దుదాం: కలెక్టర్

image

విశాఖ‌ను మాద‌క ద్ర‌వ్య ర‌హిత జిల్లాగా తీర్చుదిద్ద‌దామ‌ని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. న‌షా ముక్త్ భార‌త్ అభియాన్ ప్ర‌తిజ్ఞలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. యువత పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్య నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు.

Similar News

News August 16, 2025

పెద్ద సంఖ్యలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం: కమిషనర్

image

VMRDA పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదించామని కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. విశాఖ, విజయనగరం అనకాపల్లి జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. పలు ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధికి చేస్తున్నామన్నారు.

News August 15, 2025

విశాఖలో నకిలీ మద్యం తయారీ.. ఒకరు అరెస్టు

image

సీతంపేటలో నకిలీ మద్యం తయారు చేస్తున్న కట్టమూరి రామకృష్ణను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. అతని వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5lts హోమియోపతి స్పిరిట్, 225 వివిధ బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, 76 లిక్కర్ ప్యాకేజ్ కవర్ల లేబుల్స్ మూతలు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ రవి కిరణ్, ఎస్ఐ ముసలి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

News August 15, 2025

విశాఖలో 250 మంది బిచ్చగాళ్లకు షెల్టర్

image

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ సీపీ నగరంలో బిక్షటాన చేస్తున్న 250 మందిని తీసుకువచ్చి షెల్టర్ కల్పించారు. చోడుపల్లి పైడమ్మ (77) శ్రీహరిపురంలో ఎండు చేపలు అమ్ముతూ ఉండేది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుమారుడు సాంబమూర్తి వెతకడం ప్రారంభించాడు. అయితే పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఆమె పట్టుబడింది. పోలీసుల సంరక్షణలో ఉన్న ఆమెను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.