News August 13, 2025
BIG BREAKING: సంచలన తీర్పు

TG: గవర్నర్ కోటాలో MLCలుగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం, వేరేవాళ్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ BRS నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను SEP 17కు వాయిదా వేసింది. ఖాళీ అయిన 2 MLC స్థానాల్లో నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని SC పేర్కొంది.
Similar News
News August 14, 2025
అది మన చరిత్రలో విషాదకర అధ్యాయం: మోదీ

1947లో భారత్, పాక్ విభజన సందర్భంగా జరిగిన విధ్వంసంపై PM మోదీ ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే విషాదకర అధ్యాయమైన విభజన సమయంలో అసంఖ్యాక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఊహకందని నష్టాన్ని ఎదుర్కొన్నారు. వారి ధైర్య సాహసాలను గౌరవించుకోవాల్సిన రోజు ఇది. దేశాన్ని ఐక్యంగా, సామరస్యంగా ఉంచడం మన బాధ్యత అని ఈ రోజు గుర్తు చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. #PartitionHorrorsRemembranceDay హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు.
News August 14, 2025
రేపటి నుంచి ఫ్రీ బస్..

APలో రేపటి నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది. విజయవాడ PN బస్టాండ్‌లో సా.5 గంటల సమయంలో CM పథకాన్ని ప్రారంభిస్తారు. కాగా నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదు
News August 14, 2025
శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు

బాలీవుడ్ యాక్టర్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ డీల్ విషయంలో ₹60 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెస్ట్ డీల్ TV ప్రై.లి. కంపెనీ పేరిట శిల్పా, రాజ్‌లు 2015-2023 మధ్య అక్రమాలకు పాల్పడ్డారని కొఠారీ ఆరోపించారు. కాగా రాజ్ 2021లో అశ్లీల చిత్రాల కేసులో జైలుకెళ్లొచ్చిన విషయం తెలిసిందే.