News August 13, 2025
HYD: ఐటీ రిటర్న్ పేరిట నకిలీ లింక్‌లతో జాగ్రత్త సుమా..!

ఐటీ రిటర్న్ పేరిట నకిలీ లింక్‌లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు HYD సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. అలాంటివి ఏవైనా మీరు గుర్తించినట్లయితే వెంటనే 18001030025, 18004190025 నంబర్లకు కాల్ చేసి, హెల్ప్ లైన్ ద్వారా సమాచారం పొందే అవకాశం ఉందని తెలిపారు. ITR అక్షరాన్ని వారు పంపి, లింక్‌లో జోడించి, హెల్ప్ డెస్క్ అంటూ వెబ్‌సైట్స్ లాంటివి క్రియేట్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
Similar News
News April 17, 2026
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. 2/3 <<19675689>>మెజార్టీ<<>>(352) లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు..
News April 17, 2026
‘టాక్సిక్’ స్టోరీ లైన్ చెప్పిన యశ్

ఇండిపెండెన్స్ సమయంలో గోవాలో జరిగే తండ్రీ కొడుకుల రివేంజ్ డ్రామాగా ‘టాక్సిక్’ తెరకెక్కిందని హీరో యశ్ వెల్లడించారు. లాస్ వేగాస్(US)లో జరిగిన CinemaCon వేడుకల్లో 9 నిమిషాల మూవీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కొన్నేళ్లపాటు గోవాలో కొనసాగిన పోర్చుగీస్ పాలనలో పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
News April 17, 2026
నిర్మల్: ‘గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి’

నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద టెంట్లు, తాగునీరు, విశ్రాంతి వంటి కనీస సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. రైతులు అసౌకర్యానికి గురికాకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు.


