News August 13, 2025

HYD: మెట్రో జోన్‌లో కరెంట్ తీగల మార్పునకు కీలక నిర్ణయం..!

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా మెట్రో జోన్ పరిధిలో దాదాపు 550 కిలోమీటర్ల మేరకు లైన్లలో మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న తీగల స్థాయిలో ఎయిర్ బెంచ్ కేబుల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ సెంట్రల్, సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్ పరిధిలో పోల్ టూ పోల్ తనిఖీల్లో ఓవర్ హెడ్ కండక్టర్లను మార్చాల్సిందిగా గుర్తించారు.

Similar News

News April 18, 2026

VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

image

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 18, 2026

యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం

image

మేడారంలో రాతి కట్టడం కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి కాలును కోల్పోయిన బాలుడు యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఆమెకు ములుగు కలెక్టరేట్‌లో నియామక పత్రం అందజేశారు. బాలుడి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని, వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ కళ్యాణి పాల్గొన్నారు.

News April 18, 2026

బాపట్ల: యాక్సిడెంట్.. ఇద్దరి స్పాట్ డెడ్ మృతి

image

కారంచేడు మండలం స్వర్ణ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. దగ్గుబాడు నుంచి స్వర్ణ వైపు వస్తున్న ఆటో, స్వర్ణ నుంచి దగ్గుబాటి వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.