News April 1, 2024

TPT: ఐజర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

తిరుపతి IISERలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్-ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ), బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఇతర వివరాలకు www.iiseradmissiఓn.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 13.

Similar News

News March 27, 2026

చిత్తూరు: చెస్ ఆడుతారా..?

image

ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లాస్థాయి చెస్ పోటీలు జరగనున్నాయి. చిత్తూరులో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు www.apchess.org వెబ్‌సైట్ ద్వారా ఈనెల 29వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన ఇద్దరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

News March 26, 2026

గంగవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంగవరం మండలం, మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. మేలుమాయి క్రాస్‌కు చెందిన దొరస్వామి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు మరో బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 26, 2026

చిత్తూరు: విస్తృత భద్రత ఏర్పాట్లు

image

శ్రీరామనవమి పురస్కరించుకొని దేవాలయాలు, ముఖ్య ప్రదేశాలు, శోభాయాత్రలు నిర్వహించే ప్రాంతాలలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని.. ఏ సమస్య వచ్చిన పోలీసులను సంప్రదించాలని కోరారు.