News August 13, 2025
HYD: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారా..? జాగ్రత్త..!

HYD మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో యువకులను టార్గెట్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టాక్ మార్కెట్ అంచనాలు వేస్తామని రూ.కోట్ల మోసాలు చేశారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పెట్టుబడుల్లో నెలకు 7 శాతం, వార్షికంగా 84% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయని నమ్మించారు. మొదట నమ్మించి, కొన్ని నెలలు గడిచాక, కనిపించకుండా పోయారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Similar News
News September 3, 2025
నకిలీ కాల్స్‌పై ఉద్యోగులకు ఏసీబీ సూచనలు

నకిలీ కాల్స్‌తో ఉద్యోగులను మోసగాళ్లు భయపెడుతున్న నేపథ్యంలో ACB హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ 91548 93428 నంబర్ నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు సైఫాబాద్ PSలో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. అధికారులు ఎప్పుడూ డబ్బులు అడగరు, నకిలీ కాల్స్ నమ్మొద్దు, డబ్బులు చెల్లించొద్దంటు ఏసీబీ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలంది.
News September 3, 2025
HYD: లంచం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

HYDలో GST/కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనీయర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం కేసులో అరెస్టు చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి ₹30,000 లంచం డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ₹25,000కు ఒప్పుకున్నారు. సీబీఐ బృందం రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేసింది. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
News September 3, 2025
గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీపై HYD సీపీ సమీక్ష

సీపీ సీవీ ఆనంద్ గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల భద్రతా ఏర్పాట్లపై HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోనల్ ఆఫీసర్లు, లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో భద్రత ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహిస్తామని తెలిపారు.