News August 13, 2025
నిర్మల్ జిల్లాలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ బుధవారం పట్టణంలోని పలు మెడికల్ షాపులను తనిఖీ చేశారు. జిల్లా వైద్యాధికారి రాజేందర్‌తో కలిసి మెడికల్ షాపుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కాస్మోటిక్ యాక్ట్ 1940 ఆధారంగా కొన్ని షాపుల్లో తగిన ఆధారాలను గుర్తించారు. శాఖాపరమైన నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 17, 2026
‘కమిటీ సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది’

రాష్ట్రంలో కుల గణన సర్వే నిర్వహించిన నిపుణుల కమిటీ ఛైర్మన్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. కమిటీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, నివేదిక పారదర్శకంగా, శాస్త్రీయంగా రూపొందిందని చెప్పారు.
News April 17, 2026
మిల్లర్లు రైతులకు అండగా నిలవాలి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా అన్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం లోడుతో మిల్లుల వద్ద లారీలు పడిగాపులు కాయకూడదని అన్నారు.
News April 17, 2026
జ్వరంతో ఉన్నప్పుడు పిల్లలకు ఇవి పెట్టకూడదు

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేయించిన పదార్థాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పెట్టకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావు, కడుపునొప్పి, అజీర్తి కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే చాక్లెట్స్, కేక్, జ్యూస్ వంటి తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అవుతుంది. ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు.


