News August 13, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. బుధవారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 కాగా.. 145.64 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 20.175 టీఎంసీలకు 13.7124గా ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 1,1374 క్యూసెక్కుల వరద ఎల్లంపల్లికి చేరుతోంది. దిగువకు 451 క్యూసెక్కులు వదులుతున్నారు.
Similar News
News August 13, 2025
6నెలల్లో 221 మంది మృతి: చిత్తూరు కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ప్రమాదాల నివారణపై కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి జులై వరకు 451 ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ ఘటనల్లో 221 మంది మృతిచెందారన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News August 13, 2025
ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు

AP, TGలో కుండపోత వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు రేపు కూడా సెలవు ప్రకటించారు. ఇప్పటివరకు TGలోని జగిత్యాల, హనుమకొండ, WGL, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, MDK, మంచిర్యాల, VKB జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఆదేశాలను స్కూళ్ల యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని కలెక్టర్లు, DEOలు హెచ్చరించారు. అటు APలోని గుంటూరు, NTR, బాపట్ల, ప.గో జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ఉండనుంది.
News August 13, 2025
బాపట్ల జిల్లా ప్రజలరా.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి

భారీ వర్షాలు నేపథ్యంలో బాపట్ల జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. ప్రజల అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
– బాపట్ల కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: టోల్ ఫ్రీ :1077, సెల్: 9711077372
– రేపల్లె ఆర్డీవో కంట్రోల్ రూమ్: సెల్: 8648293795
– కొల్లూరు MRO కంట్రోల్ రూమ్: సెల్ : 7794894544
-భట్టిప్రోలు MRO కంట్రోల్ రూమ్: 8331913995, 8712655931