News August 13, 2025
కృష్ణానదిలో ఇద్దరి యువకుల గల్లంతు

ఇసుక తోడే డ్రెజర్ స్థానం మార్చేందుకు తాడేపల్లి సీతానగరానికి చెందిన ముగ్గురు యువకులు నదిలోకి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటన తుళ్లూరు (M) ఉద్దండరాయునిపాలెంలో చోటుచేసుకుంది. కామేశ్వరావు(19), వీర ఉపేంద్ర(22) కొట్టుకెళ్లగా వెంకటేశ్వర్లు సురక్షితంగా బయటపడ్డాడు. మరోవైపు కొండమోడు వద్ద పోతులవాగులో వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. కృష్ణా నదికి వరద నీరు వస్తుండటంలో ప్రజలు ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News August 16, 2025
నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: ఖమ్మం అ.కలెక్టర్

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పాలేరు రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.
News August 16, 2025
చింతలపూడి: తమ్మిలేరు ప్రాజెక్టుకు భారీగా వరద

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3,400 క్యూసెక్కులు చేరుకోగా, నీటి మట్టం 344 అడుగులకు చేరింది. దీంతో చింతలపూడి మండలంలోని మూడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News August 16, 2025
కృష్ణా: కొంప ముంచుతున్న క్లౌడ్ బరస్టులు.. జిల్లాలో ఇలా!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కారణం క్లౌడ్‌బరస్ట్ అని అధికారులు చెబుతున్నారు. గతంలో 15-18 గంటల్లో కురిసే 100 మిల్లీమీటర్ల వర్షపాతం, ప్రస్తుతం కేవలం మూడు-నాలుగు గంటల్లోనే కురుస్తుండటంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, పంటపొలాలు నీట మునుగుతున్నాయి. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో సరాసరి 50-100 మి.మీ. వరకు వర్షం కురిసింది. ఈ అసాధారణ వాతావరణ మార్పుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.