News April 1, 2024
ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేనా?

IPLలో ఈరోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఆడిన 2మ్యాచుల్లోనూ గెలిచి రాజస్థాన్ జోరు మీదుంది. మరోవైపు ముంబై ఆడిన రెండింట్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉంది. ఈరోజు గెలిచి బోణీ కొట్టాలని MI పట్టుదలతో ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు 28మ్యాచుల్లో తలపడగా.. ముంబై 15, రాజస్థాన్ 12 మ్యాచుల్లో గెలిచాయి. ఒక దాంట్లో ఫలితం రాలేదు.
Similar News
News March 17, 2026
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)
News March 17, 2026
రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.