News August 13, 2025

కృష్ణా జిల్లాలో 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

కృష్ణా జిల్లాలో అధిక వర్షాలు, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నామని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మంత్రి అనితకు వివరించారు. 62 దుర్బల గ్రామాలు, 16 లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. బోట్లు, రవాణా సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బుధవారం అత్యధికంగా 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.

Similar News

News April 17, 2026

కృష్ణా జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 10,15,634 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,93,141 మంది ఉండగా, మహిళలు 5,22,463 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 30 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

క్రీడాకారులకు ‘శాప్’ అండగా ఉంటుంది: భరణి

image

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్. భరణితో కృష్ణా జిల్లా టైక్వాండో అసోసియేషన్ కోశాధికారి అశ్విని గోగులమూడి, సభ్యురాలు సరితా దేవి శుక్రవారం భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన పారా జాతీయ టైక్వాండో పోటీలలో రాష్ట్ర క్రీడాకారులు ప్రశాంత్, షణ్ముఖ్ సాధించిన విజయాలను వారు ఎండీకి వివరించారు. క్రీడాకారుల ప్రతిభను అభినందించిన భరణి, వారికి శాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.