News August 13, 2025

వికారాబాద్: రెండు రోజులు స్కూల్స్‌కు సెలవు

image

VKB జిల్లాలో ఈనెల 14, 15వ తేదీల్లో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు DEO రేణుకాదేవి తెలిపారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉపాధ్యాయులు మాత్రం యధావిధిగా పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల వలే తమకు కూడా సెలవు ప్రకటించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Similar News

News April 15, 2026

తెలంగాణ స్క్వాష్ జట్టు కోచ్‌గా నిజామాబాద్ వాసి

image

నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన బీ.దీపక్ కుమార్ ఈ నెల ఏప్రిల్ 16 – 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే 69వ జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని పీడీ రాము తెలిపారు. జిల్లా యువకుడు ఈ ఎంపిక పట్ల యానంపల్లి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News April 15, 2026

AP, TGలో ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరుగుతాయ్?

image

లోక్‌సభ స్థానాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మారనుంది. మొత్తం సీట్లు 850కి (54.54%) పెరిగితే.. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా ఏపీలో 14, తెలంగాణలో 9 సీట్లు కలవనున్నాయి. అంటే ఏపీలో మొత్తం ఎంపీ సీట్లు 39కి, తెలంగాణలో 26కి చేరతాయి. ఒకవేళ పెంపు 50%కే పరిమితమైతే APలో 13 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాదిలో 50% అయితే 65 సీట్లు, 54.54% అయితే 71 స్థానాలు పెరుగుతాయి.

News April 15, 2026

ADB: పల్లెకు చేరువయ్యేనా ‘ప్రగతి చక్రం’?

image

జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పల్లెవాసులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ‘మహాలక్ష్మి’ పథకంతో బస్సులకు రద్దీ పెరిగినా, తిర్యాణి, నార్నూర్, బజార్‌హత్నూర్, భీంపూర్ వంటి మారుమూల మండలాల్లోని గిరిజన గూడాలకు నేటికీ ఆర్టీసీ సౌకర్యం కలగానే మిగిలింది. వర్షాకాలంలో వాగులు పొంగి రవాణా నిలిచిపోతుండటంతో విద్యార్థులు, రోగులు అల్లాడుతున్నారు. అన్ని కాలాల్లో బస్సు నడపాలని కోరుతున్నారు.