News April 1, 2024
వానాకాలం ఆరంభంలోనే విత్తనాలు

TG: వానాకాలంలో వేయాల్సిన పంటలకు సీజన్ ఆరంభంలోనే అన్ని రకాల విత్తనాలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈమేరకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఏటా వానాకాలం సీజన్‌లో దాదాపు 1.26కోట్ల ఎకరాల మేర పంటలు సాగవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కల్తీ విత్తనాల బెడద ఉంది. రబీ సీజన్‌లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కల్తీ విత్తనాల కట్టడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Similar News
News March 18, 2026
ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 18, 2026
మరికొన్ని గంటల్లో విధ్వంసం.. ఇరాన్ హెచ్చరిక

మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సమ్రెఫ్, ఖతర్‌లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యూఏఈలోని అల్-హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.
News March 18, 2026
PHOTOS: ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభోత్సవం

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి 11 కి.మీ. బస్సులో ప్రయాణించారు. వారి బాగోగులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అంతకుముందు సీఎం తన నివాసంలో దివ్యాంగులకు విందు ఇచ్చారు. ఆ కార్యక్రమ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.


