News August 13, 2025

HYD: రేపు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలి: సైబరాబాద్ పోలీసులు

image

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాలని ఐటీ కంపెనీలను సైబరాబాద్ పోలీసులు కోరారు. దీంతో ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ సూచించారు. వీలైనంత వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. SHARE IT

Similar News

News August 16, 2025

త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

AP: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్‌మెన్, 800 AEE పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు CMకు వివరించారు. సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.

News August 16, 2025

తిరుపతి: తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్నాప్

image

తండ్రి అప్పు తీర్చలేదని కూతురిని వ్యాపారి కిడ్నాప్ చేశాడు. ప్రకాశం(D) చీమకుర్తి(M)కి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వెళ్లాడు. ఆ సమయంలో ఈశ్వర్ రెడ్డి నుంచి రూ.5లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో శ్రీనివాసరావు కూతురిని ఈశ్వర్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఈశ్వర్‌రెడ్డిని కావలి వద్ద పట్టుకున్నారు.

News August 16, 2025

నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: ఖమ్మం అ.కలెక్టర్

image

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పాలేరు రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.