News August 13, 2025
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

యర్రావారిపాలెం మండలం తలకోనలో బుధవారం జిల్లా స్థాయి ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News August 16, 2025
ఖమ్మం: చెరువు కాదు.. బడే ఇది.!

ఏన్కూరు మండలం భద్రుతండాలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం భారీ వర్షాల కారణంగా చెరువును తలపిస్తోంది. పాఠశాల రోడ్డు కంటే దిగువన ఉండటంతో వర్షపు నీరు ప్రాంగణంలోకి చేరుతోంది. దీంతో తరగతులకు వెళ్లడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలవుల అనంతరం సోమవారం పాఠశాల తెరిచేలోగా అధికారులు సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News August 16, 2025
ఏలూరు: 11 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా, సేవా పత్రాలు

ఏలూరులో 11 మంది పోలీస్ సిబ్బందికి మంత్రి పార్థసారధి ప్రశంసా పత్రాలను శుక్రవారం అందజేశారు. సేవా పత్రాలు అందుకున్నవారు: నూజివీడు రూరల్ CI: రామకృష్ణ, నిడమర్రు CI: సుభాష్, RIGSP: పవన్ కుమార్, దెందులూరు: సత్యనారాయణ, ఏలూరు: కృష్ణారావు, వెంకటేశ్వరరావు, AR: చిట్టిబాబు, చింతలపూడి: సురేశ్, టి.నర్సాపురం: నాగబాబు, DCRB: శ్రీనివాస్, DSP హెడ్ కానిస్టేబుల్: నాగులు, పోలీస్ PRO: కేశవరావు.
News August 16, 2025
త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్‌మెన్, 800 AEE పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు CMకు వివరించారు. సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.