News August 13, 2025
‘కూలీ’ సినిమాను ఎంజాయ్ చేశా: ఉదయనిధి

రేపు విడుదల కానున్న రజినీకాంత్ ‘కూలీ’ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు అభినందనలు. ఈ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రతి సన్నివేశం ఎంజాయ్ చేశా. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News August 16, 2025
రూ.100 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్: సత్యకుమార్

AP: విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో రాష్ట్రస్థాయి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నెల రోజుల్లో తిరుమల, విశాఖలో టెస్టింగ్ ప్రారంభిస్తామన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు దాదాపు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
News August 16, 2025
త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్‌మెన్, 800 AEE పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు CMకు వివరించారు. సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.
News August 16, 2025
తల్లీకొడుకుల అక్రమ సరోగసీ దందా.. అరెస్ట్

TG: అపార్టుమెంట్లో అక్రమంగా సరోగసీ దందా చేస్తున్న తల్లీకొడుకులు లక్ష్మీరెడ్డి(45), నరేందర్‌రెడ్డి(23)ని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వివిధ రాష్ట్రాల నుంచి మహిళల్ని తీసుకొచ్చి తమ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. IVF ద్వారా గర్భం దాల్చేలా చేసి, పిల్లలు పుట్టిన తర్వాత ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపేస్తారు. పిల్లలు లేని ధనవంతుల కుటుంబాలే టార్గెట్‌గా ఒక్కో సరోగసీకి రూ.10-20 లక్షలు వసూలు చేస్తున్నారు.