News August 13, 2025
శ్రీలంక కాలనీ❎.. కొలను✅

జన్నారం మండలంలోని శ్రీలంక కాలనీ కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైంది. కాలనీలో రోడ్డుకిరువైపులా మురుగునీటి కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్డుపైకి చేరి, నడవడానికి వీలు లేకుండా తయారైంది. కాలనీవాసులు ఇళ్లలోనుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు.
Similar News
News August 16, 2025
రూ.100 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్: సత్యకుమార్

AP: విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో రాష్ట్రస్థాయి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నెల రోజుల్లో తిరుమల, విశాఖలో టెస్టింగ్ ప్రారంభిస్తామన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు దాదాపు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
News August 16, 2025
వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్

ఏపీ కేడర్-2023 బ్యాచ్‌కు చెందిన IFS అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ CS కె.విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ 2023లో విడుదలైన IFS ఫలితాల్లో ఆల్ ఇండియాలో టాప్ 1 ర్యాంక్ సాధించారు. మొదటి పోస్టింగ్ వెంకటగిరిలో సబ్ DFOగా పోస్టింగ్ ఇచ్చారు.
News August 16, 2025
నరసాపురం: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

నరసాపురం మండలంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 13న బాలికను ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు కుడిపూడి నాగబాలాజీ (39) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ టీవీ సురేశ్ తెలిపారు.