News August 13, 2025

కాసిపేట: అప్పుల బాధకు లారీ డ్రైవర్ ఆత్మహత్య

image

కాసిపేట మండలం సోమగూడెంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ MD.రంజాన్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని SI ఆంజనేయులు తెలిపారు. లారీ నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్న రంజాన్ కొత్త లారీ కొని అప్పుల పాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలో ప్రమాదం జరిగింది. కుటుంబీకులతో చెప్పి బాధపడుతూ మానసికంగా కుంగిపోయి ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News August 16, 2025

రూ.100 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్: సత్యకుమార్

image

AP: విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో రాష్ట్రస్థాయి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నెల రోజుల్లో తిరుమల, విశాఖలో టెస్టింగ్ ప్రారంభిస్తామన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు దాదాపు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

News August 16, 2025

వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్‌

image

ఏపీ కేడర్-2023 బ్యాచ్‌కు చెందిన IFS అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ CS కె.విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్‌ 2023లో విడుదలైన IFS ఫలితాల్లో ఆల్ ఇండియాలో టాప్ 1 ర్యాంక్ సాధించారు. మొదటి పోస్టింగ్ వెంకటగిరిలో సబ్ DFOగా పోస్టింగ్ ఇచ్చారు.

News August 16, 2025

నరసాపురం: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

image

నరసాపురం మండలంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 13న బాలికను ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు కుడిపూడి నాగబాలాజీ (39) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ టీవీ సురేశ్ తెలిపారు.