News August 13, 2025

మెదక్: అవార్డులలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

image

జనవరి 26, పంద్రాగస్టు 15కు ఇచ్చే అవార్డులలో అవకాశం కల్పించాలని నాల్గవ తరగతి పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సామ్యూల్, వెంకటేశం, మహమ్మద్ కురిషీద్, దుబా రాజమ్మ, సుజాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ వివిధ శాఖలో పనిచేసే సిబ్బందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తమను గుర్తించాలని కోరారు.

Similar News

News August 14, 2025

మెదక్: అండర్-15 జిల్లా స్థాయి ఎంపికలు

image

జిల్లా స్థాయి వాలీబాల్ బాల, బాలికల (అండర్-15) ఎంపికలు మెదక్ గుల్షన్ క్లబ్‌లో గురువారం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది బాలురు, 8 మంది బాలికలతో కూడిన జట్టును ఎంపిక చేశారు. నిర్వాహకులు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మేడి మధుసూదన్ రావు, రిటైర్డ్ పీడీ డైరెక్టర్ ప్రభు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, నరేశ్, మాధవరెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

News August 14, 2025

మెదక్: 20 అడుగులకు చేరిన పోచారం ప్రాజెక్ట్

image

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం గురువారం 20 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. దిగువ పంటలకు కాలువ ద్వారా నీరు వదిలారు.

News August 14, 2025

మెదక్: ‘ప్రామాణికంగా భద్రతా చర్యలు చేపట్టాలి’

image

భద్రతా చర్యలను ప్రామాణికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి నెహ్రూ తెలిపారు. బుధవారం చేగుంట మండలం శ్రీ వెంకటేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, చిన్న శివనూర్, డెల్ ఎక్స్ ఎల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కూచారం, శివంపేట మండలం లూయిస్ ఫార్మా సీయుటుకల్స్, ప్రైవేట్ లిమిటెడ్ నవాబ్ పేట సంబంధిత పరిశ్రమలను పరిశీలించారు.