News August 13, 2025
మెదక్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి వివేక్

మెదక్ జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకల కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.
Similar News
News August 16, 2025
మెదక్: అత్యధికంగా శివంపేటలో 128 మిమీ వర్షం

మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా శివంపేటలో 128 మిమీలు, నర్సాపూర్లో 108.8, కాగజ్ మద్దూర్‌లో 98.8, పెద్ద శంకరంపేటలో 89, బోడగట్టు ఈఎస్ఎస్ 74.5, కాళ్లకల్ 68 మిమీలు, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయింది.
News August 16, 2025
మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు: మంత్రి వివేక్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి మాట్లాడారు.
News August 15, 2025
మెదక్ ఇంటర్ టాపర్‌కు పురస్కారం

మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ టాపర్ ఉప్పరి విక్రమ్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి నగదు పురస్కారం అందజేశారు. చిన్నశంకరంపేట మోడల్ కళాశాలకు చెందిన విక్రమ్ ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించి పురస్కారాన్ని అందుకున్నాడు. పంద్రాగస్టు వేడుకల్లో కలెక్టర్ రాహుల్ రాజు, ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో మంత్రి వివేక్ రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. ప్రిన్సిపల్ వాణీ కుమారిని కలెక్టర్ అభినందించారు.