News August 13, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

బైక్‌పై వెళుతూ ట్రాక్టర్‌ను ఢీ కొని యువకుడు మృతి చెందిన ఘటన చెరుకుపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గూడవల్లికి చెందిన రాయన పవన్ (20) బైక్‌పై చెరుకుపల్లి వెళ్తూ ముందున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పవన్ తలకు గాయమైంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News April 16, 2026

సూర్యాపేట: ఆచరించి.. ఆదర్శంగా నిలిచారు

image

రోడ్డు భద్రత కేవలం నినాదాలకే పరిమితం కాదని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ ఆచరించి చూపారు. గురువారం నిర్వహించిన ‘ఆరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తిరుగు ప్రయాణంలో తమ కారు ఎక్కగానే స్వయంగా సీట్ బెల్ట్ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రమాద సమయాల్లో సీట్ బెల్ట్ ప్రాణరక్షక కవచంలా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

News April 16, 2026

ఏలూరు: మత్స్య సాగు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజ్‌కుమార్‌ తెలిపారు. మత్స్యకారులు, యువకులు, సహకార సంఘాల సభ్యులు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉపకార వేతనం లేకుండా 20 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News April 16, 2026

భూపాలపల్లి: ఆర్భాటం అదిరింది.. ఆచరణ కొరవడింది..!

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖాధికారిణి మల్లిశ్వరి ఎంతో <<19434820>>ఆర్భాటంగా ప్రకటించిన<<>> ‘సెల్ఫీ విత్ డాటర్’ కార్యక్రమం ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. సెల్ఫీలు పంపాలని గడువు విధించారు కానీ ఆ గడువు ముగిసి రోజులు గడుస్తున్నా ఫలితాల ఊసే లేదు. తమ కుమార్తెలతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఫొటోలు పంపి బహుమతుల కోసం వేచి చూస్తున్న తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందడంలేదు.