News August 13, 2025

‘ఫస్ట్ డే’ కంటే జీవితం ముఖ్యం మిత్రమా!

image

రేపు NTR-హృతిక్ రోషన్ ‘వార్ 2’, రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ కానున్నాయి. టికెట్లు సైతం భారీగా బుక్ అయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. సినిమా ఫస్ట్ డే కాకపోతే మరునాడైనా చూడొచ్చు. అంతేగానీ థియేటర్ల వద్ద ఎగబడి ప్రాణాల మీదకు తెచ్చుకోకపోవడం మంచిది. మీరేమంటారు?

Similar News

News August 16, 2025

ప్చ్.. ‘బ్యాడ్’మింటన్

image

భారత బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సైనా, సింధు, శ్రీకాంత్, సాత్విక్, చిరాగ్ వంటి షట్లర్లు వరల్డ్ టాప్ ర్యాంకులను ఏలారు. ఇప్పుడేమో టాప్10లో సాత్విక్-చిరాగ్ జోడీ(9) మినహా ఎవరూ లేరు. 15లో సింధు, 21లో లక్ష్యసేన్ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చితే దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ, అకాడమీలకు ప్రోత్సాహం పెరిగాయి. ఆట మాత్రం ‘బ్యాడ్’గా మారింది.

News August 16, 2025

నేడు ఝార్ఖండ్‌కు సీఎం రేవంత్

image

TG: నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఝార్ఖండ్‌కు వెళ్లనున్నారు. మాజీ సీఎం శిబూ సోరెన్ 11వ రోజు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి అక్కడికి చేరుకుంటారు. శిబూ సోరెన్ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలియజేస్తారు. సోరెన్ మరణం తర్వాత ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీయనున్నారు.

News August 16, 2025

రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

image

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.