News August 13, 2025
ASF: ‘కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించండి’

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది 2 రోజులుగా సమస్యల పరిష్కారానికి AITUC ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐ వివరాలను స్పష్టం చేయాలని వారు కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.
Similar News
News April 18, 2026
కృష్ణా: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన మహిళలు

మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన ఘటన కృష్ణా(D) పెడనలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పరిధిలో గృహ సముదాయాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకున్నామని SI బషీర్ చెప్పారు. ఆటలో పాల్గొన్న నలుగురు మహిళలు, ఇద్దరు పురుషుల నుంచి రూ.47,750 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దొరికింది కొంత నగదే.. అక్కడి మహిళలు రూ.లక్షల్లో పందేలు కాస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.
News April 18, 2026
కుప్పంలో మరో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గుడిపల్లి (M) కుప్పిగాని పల్లి, దాసిమానిపల్లి, అంగనామాల కొత్తూరు గ్రామాల పరిధిలో 105 ఎకరాల భూమిని NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రూ.2550 కోట్ల పెట్టుబడితో కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పాలసీ (2025-30) కింద ఆమోదించింది
News April 18, 2026
తిరుపతి: వివాహితపై రేప్

భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత(34) బతుకుతెరువు కోసం శ్రీసిటీలో పనిచేస్తోంది. BN కండిగలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. BN కండ్రిగ మండలం పదో మైలు వద్ద నివాసం ఉన్నారు. ఆమె రాత్రి వేళ కాలినడకన వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి వెంబడించి ఆర్.అనంతాపురం చెరువు సమీపంలోని ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


