News August 13, 2025

ASF: జూబ్లీ మార్కెట్‌కు జలగండం

image

ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని రాజంపేట జూబ్లీ మార్కెట్ భారీ వర్షాలకు జలమయమైంది. కూరగాయలు, చికెన్, మటన్, చేపల దుకాణాలున్న ఈ మార్కెట్‌లో నీరు నిలవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది నుంచి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాపారులు వాపోయారు. మార్కెట్‌లోకి నీరు రాకుండా సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నారు.

Similar News

News August 16, 2025

తూ. గో: ఘాట్ రోడ్లలోనూ ఉచిత బస్సులు

image

రాష్ట్రంలోని ఘాట్ రోడ్లలో కూడా మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చని తూ.గో ఆర్టీసీ డీపీటీఓ వై.సత్యనారాయణ మూర్తి తెలిపారు. భద్రతా కారణాల వల్ల మొదట నిలిపివేసినప్పటికీ, తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాజమండ్రి-భద్రాచలం, శ్రీశైలం వంటి మార్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

News August 16, 2025

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత

image

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ బాబ్ సిమ్సన్(89) కన్నుమూశారు. 1957 నుంచి 1978 వరకు 68 టెస్టులు ఆడిన ఆయన 4,869 రన్స్ చేశారు. 71 వికెట్లు పడగొట్టారు. అయితే 1968లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సిమ్సన్ 1977లో 41 ఏళ్ల వయసులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ మరుసటి ఏడాదే రిటైర్ అయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా కోచ్‌గా మారారు. ఆయన కోచింగ్‌లోనే AUS 1987 WC, యాషెస్ సిరీస్ గెలిచింది.

News August 16, 2025

ఉదయగిరి: దొంగలను పోలీసులుకు అప్పగించిన గ్రామస్థులు

image

ఉదయగిరి (M) కుర్రపల్లిలో మేకలు దొంగతనం చేసేందుకు యత్నించిన ముగ్గురిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన గోర్తుల వినోద్ కుమార్‌కు చెందిన మేకల దొడ్డిలో మేకలను దొంగలించేందుకు వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలు ఆటోలో వచ్చారు. మేకలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా కుక్కలు అరవడంతో గ్రామస్థులు వారిని పట్టుకుని ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు.