News August 13, 2025

ఖమ్మం జిల్లాలో 575 మి.మీ వర్షాపాతం నమోదు

image

ఖమ్మం జిల్లాలో నేడు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నమోదైన వర్షాపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మధిరలో 66.5 మి.మీ, వేంసూరు 59.2, కూసుమంచి 52.3, బోనకల్ 49.5, ఎర్రుపాలెం 40.7, ముదిగొండ 38.6 మి.మీ. వర్షం పడింది. తక్కువగా సింగరేణిలో 3.4, తల్లాడలో 3.2 మి.మీ. నమోదైంది. మొత్తం 21 మండలాల్లో 575 మి.మీ నమోదైందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News August 14, 2025

మైనారిటీ గురుకుల సెక్రటరీని తొలగించాలి: ABVP

image

మైనారిటీ గురుకుల సెక్రటరీని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతాంజలి, ప్రణీత్, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

News August 14, 2025

రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి బ్రిడ్జి సమీపాన ఆటోను బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు ద్విచక్రవాహనదారుడు బుధవారం మృతిచెందారు. ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ నరేశ్(28) కరుణగిరి వైపు వెళ్తుండగా మున్నేరు బ్రిడ్జి వద్దకు రాగానే ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆటోడ్రైవర్ నరేశ్‌‌తో పాటు బైక్ డ్రైవర్ రాంచరణ్ సాయి(22, ఖమ్మం బొక్కలగడ్డ) మృతిచెందారు.

News August 14, 2025

ఖమ్మం: ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. సత్తుపల్లి జేవియర్ ప్రభుత్వ కళాశాలలోని అంబేడ్కర్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ పూర్ణచందర్‌రావు ఈ విషయాన్ని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, ఓపెన్ ఇంటర్, లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. అలాగే, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజులను ఈ నెల 20లోపు చెల్లించాలని ఆయన సూచించారు.