News August 13, 2025

DSC అభ్యర్థులకు BIG ALERT

image

AP: మెగా డీఎస్సీ స్కోర్ కార్డులు ఇటీవల <<17374210>>విడుదలైన<<>> విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను ఇవాళ రాత్రి నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలుంటే సైట్‌లో సరిచూసుకోవడానికి రేపు రాత్రి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది.

Similar News

News August 14, 2025

హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల్లో ఉప ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. కాగా పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

News August 14, 2025

BIG ALERT: ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు

image

AP: అతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, యానాం ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని సూచించింది.

News August 14, 2025

అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. JGL, భూపాలపల్లి, KNR, MHBD, MNCL, ములుగు, NML, NZB, PDPL జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. HYD, ADB, భద్రాద్రి, HNK, MDK, SRCL, WGL, ఖమ్మం, కొమురం భీం, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.