News August 13, 2025
ADB: స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులు వీరే

రానున్న 79వ స్వాతంత్ర్య వేడుకలకు జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి కార్యక్రమం ముఖ్య అతిథులను ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, మంచిర్యాల జిల్లాకు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, నిర్మల్ జిల్లాకు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్యను నియమించారు.
Similar News
News April 19, 2026
గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.