News August 13, 2025

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కానిస్టేబుల్ మృతి

image

సూసైడ్ అటెంప్ట్‌కు పాల్పడిన కానిస్టేబుల్ తూము కిరణ్‌బాబు(40) ఈరోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిరణ్ 2017లో మీర్‌చౌక్ PSలో పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తిరిగి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఈనెల4న పెట్రోల్ పోసుకొని సూసైడ్‌కు యత్నించాడు. 60% కాలిన గాయాలతో గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. తమను ఆదుకోవాలని భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News August 14, 2025

పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్

image

పెద్దమ్మగుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయ్యింది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని న్యాయవాది పల్లె వినోద్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హైకోర్టులో పెద్దమ్మ గుడి కూల్చివేతపై విచారణ జరగనుంది. గుడి కూల్చివేత కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషన్‌లో పేర్కొన్నారు.

News August 14, 2025

గాంధీ భవన్‌లో ‘రాజీవ్ జ్యోతి’కి ఘన స్వాగతం

image

ఏటా పెరంబదూర్ నుంచి ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి నాటికి ఢిల్లీకి చేరుకునేలా చేపట్టే రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు HYDకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచన మేరకు యాత్రకు గాంధీ భవన్‌లో స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్, నాంపల్లి ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ ఉన్నారు.

News August 14, 2025

HYD: ప్రాణాలు పోతేనే స్పందిస్తారా..?

image

సికింద్రాబాద్ కార్ఖానా ట్రాఫిక్ PS పక్కనే మెయిన్‌ రోడ్డుపై భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత ఏర్పడి ఏడాది దాటిందని, ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయలేదని, ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి ఓ కారు వేగంగా వచ్చి గుంతను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చిన బైక్ నడిపే వ్యక్తి కారును ఢీకొట్టి గాయపడ్డాడు. మీ ప్రాంతంలో ఇలాంటి గుంతలు ఉంటే కామెంట్ చేయండి.