News August 13, 2025
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కానిస్టేబుల్ మృతి

సూసైడ్ అటెంప్ట్‌కు పాల్పడిన కానిస్టేబుల్ తూము కిరణ్‌బాబు(40) ఈరోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిరణ్ 2017లో మీర్‌చౌక్ PSలో పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. తిరిగి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఈనెల4న పెట్రోల్ పోసుకొని సూసైడ్‌కు యత్నించాడు. 60% కాలిన గాయాలతో గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. తమను ఆదుకోవాలని భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 16, 2026
VKB జిల్లా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి!

జిల్లాలో భూగర్భ జల మట్టం రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోంది. జిల్లాలో సగటున 13.9 మీటర్ల లోతుకు నీటి నిల్వలు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షపాతం తగ్గడం మరియు విచ్చలవిడిగా బోర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News April 16, 2026
MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.


