News August 13, 2025

మత్స్యకారులకు కలెక్టర్ హెచ్చరికల జారీ

image

భారీ వర్షాల సమాచారంతో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కలెక్టర్ వెంకటమురళి హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం జిల్లా అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సముద్రంలోకి మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల 50వేల ఎకరాలు నీట మునిగాయన్నారు.

Similar News

News April 18, 2026

NLG: ఇందిరమ్మ ఇళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!

image

TG అర్బన్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో దశలో సొంత స్థలం లేని వారిని L2 జాబితాలో తీసుకొని వారికి 2BHK ఇళ్లు ఏ స్థితిలో ఉంటే అలాగే అప్పగించాలని GOVT నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి Way2Newsకు తెలిపారు. మిగిలిన పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే వారికి బిల్లులు మంజూరు చేస్తారు. వీటి కోసం లబ్ధిదారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి MBNR జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

News April 18, 2026

అత్యాచారాలు చేసేవారిపై కాకుండా ప్రశ్నించే వారిపై కేసులా: YS జగన్

image

AP: ప్రశ్నించే గొంతుకలకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేస్తోందని జగన్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అక్రమ కేసు పెట్టడానికి, ఇంట్లో సోదాలు చేయడానికి అతనేమైనా ఉగ్రవాదా? అని మండిపడ్డారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.

News April 18, 2026

ఇందిరమ్మ ఇళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!