News August 14, 2025
సూర్యాపేట: పరిశ్రమలలో భద్రతా ప్రమాణాల పరిశీలన

సూర్యాపేట జిల్లాలోని పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్యాస్, ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో జిల్లా అధికారులు భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ తనిఖీలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.వి.శ్రీదేవి, ఫైర్ ఆఫీసర్ జె.జానయ్య, అలాగే ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పరిశ్రమలలో భద్రతా చర్యలను అధికారులు పరిశీలించారు.
Similar News
News April 18, 2026
నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.
News April 18, 2026
మారని కోల్‘కథ’.. ఇక ఇంటికేనా?

IPL 2026లో KKR పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 6 మ్యాచుల్లో 5 ఓడగా, వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఇంకా 8 మ్యాచులు మిగిలి ఉండటంతో కనీసం 7 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం టీమ్ ఆట తీరు చూస్తే అది అనుమానమే. ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అసాధారణ రీతిలో పుంజుకుంటే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం దాదాపు అసాధ్యం. మీరేమంటారు?
News April 18, 2026
గాడిదలా నటించమని అడిగినా సరే..: ఆర్య

దర్శకులు బాల, పా.రంజిత్‌ను తాను ఎంతో నమ్ముతానని తమిళ హీరో ఆర్య చెప్పారు. వాళ్లతో సినిమాలకు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. ‘నాకు కథ చెప్పకుండానే వెట్టువమ్ మూవీని రంజిత్ తీస్తున్నారు. బాల సర్ నన్ను గాడిదగా చేయమన్నా సరే చేసేస్తా. నెల రోజుల్లో అఘోరీ లుక్(నేనే దేవుడ్ని) కోసం సిద్ధమవ్వాలని చెప్పి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు’ అని ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పారు.


